ప్రత్యేక అలంకరణలో భద్రకాళి అమ్మవారు
WGL: తెలంగాణ ఇంద్రకీలాద్రిగా ప్రసిద్ధిగాంచిన శ్రీ భద్రకాళి అమ్మవారి ఆలయంలో మంగళవారం హోలీ పండుగ సందర్భంగా అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఉదయాన్నే ఆలయ ప్రధాన అర్చకులు భద్రకాళి శేషు అమ్మవారిని విశేషంగా అలంకరించి.. ప్రత్యేక పూజలు చేశారు. ఉదయం నుండే భక్తులు ఆలయానికి తరలివచ్చి అమ్మవారిని దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు.