నీటి ఎద్దడి లేకుండా చర్యలు: ఎంపీడీఓ

PDPL:పెద్దపల్లి మండలంలో వేసవికాలంలో ప్రజలకు తాగునీటి కొరత ఏర్పడకుండా తగు చర్యలు తీసుకుంటున్నామని ఎంపీడీఓ శ్రీనివాస్ తెలిపారు. మండలంలోని పలు గ్రామాల్లో పర్యటించారు. గ్రామాల్లో తాగునీటి అవసరాలు, ట్యాంకర్ల ఏర్పాటు, బోర్ల పని స్థితి వంటి అంశాలను సమీక్షిస్తున్నామని తెలిపారు. ప్రజలు ఇబ్బందులు పడకుండా ముందస్తు ప్రణాళికలు చేస్తున్నామన్నారు.