విద్యార్థుల సమస్యలను వెంటనే పరిష్కరించాలి: కలెక్టర్
WGL: జిల్లాలోని ప్రభుత్వ సంక్షేమ గురుకుల పాఠశాలల్లో ఏర్పాటు చేసిన ఫిర్యాదు పెట్టెల ద్వారా విద్యార్థుల సమస్యలు త్వరగా పరిష్కారమవుతున్నాయని జిల్లా డా. కలెక్టర్ సత్య శారద తెలిపారు. WGL కలెక్టర్ కార్యాలయంలో శనివారం రాత్రి ఫిర్యాదులు పెట్టెలో వచ్చిన ఫిర్యాదులను కలెక్టర్ స్వయంగా చదివారు. విద్యార్థుల సమస్యలను వెంటనే పరిష్కరించాలని అధికారులకు ఆదేశించారు.