VIDEO: పంట కాలువలో గుర్తు తెలియని మృతదేహం లభ్యం

VIDEO: పంట కాలువలో గుర్తు తెలియని మృతదేహం లభ్యం

కోనసీమ: రాయవరం మండలం పసలపూడి బస్టాండ్ వద్ద మండపేట కాలువలో శుక్రవారం గుర్తుతెలియని పురుషుడి మృతదేహం లభ్యమైంది. కాలువ పైభాగం నుంచి నీటి ప్రవాహంలో కొట్టుకొని వచ్చినట్లు స్థానికులు గుర్తించారు. గుర్తు తెలియని మృతుడి వయస్సు 30–35 సంవత్సరాల ఉంటుందని భావిస్తున్నారు. షర్ట్, ఫ్యాంట్ ధరించి ఉన్నాడు. మృతదేహాన్ని పోలీసులు ఆసుపత్రికి తరలించారు.