జగన్‌ను కలిసిన విజయవాడ కూల్చివేతల బాధితులు

జగన్‌ను కలిసిన విజయవాడ కూల్చివేతల బాధితులు

AP: కోర్టు ఆదేశాలతో అధికారులు ఇటీవల విజయవాడ భవానీపురంలోని 42 ఫ్లాట్లను కూల్చిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో తమ గోడును విన్నవించేందుకు బాధితులు మాజీ సీఎం వైఎస్ జగన్‌ను కలిశారు. తమ సమస్యను వివరించిన అనంతరం వినతి పత్రం అందజేశారు. బెంగళూరు నుంచి గన్నవరం ఎయిర్‌పోర్ట్‌కు చేరుకున్న ఆయన బాధితులకు అండగా ఉంటానని హామీ ఇచ్చారు.