విజేతలకు బహుమతులు అందించిన ఎమ్మెల్యే

NRPT: నారాయణపేట మండలం జాజాపూర్ గ్రామంలో నిర్వహించిన క్రికెట్ పోటీల్లో విజేతలకు ఆదివారం ఎమ్మెల్యే చిట్టెం పర్ణిక రెడ్డి విజేతలకు బహుమతులు అందించారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ.. క్రీడల్లో గెలుపు ఓటములు సమానంగా స్వీకరించాలని అన్నారు. క్రికెట్లో రాణించి రాష్ట్ర జాతీయ స్థాయిలో రాణించాలని అన్నారు.