ప్రోటోకాల్ పాటించని అధికారులపై ఫిర్యాదు

ప్రోటోకాల్ పాటించని అధికారులపై ఫిర్యాదు

AKP: అధికారులు ప్రోటోకాల్ పాటించడం లేదని అనకాపల్లి ఎంపీపీ గొర్లి సూరిబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. తగరంపూడి-2 అంగన్వాడీ కేంద్రం నిర్మాణానికి మండల పరిషత్ నుంచి రూ.4.30 లక్షలు విడుదల చేసామన్నారు. గురువారం గ్రామంలో పర్యటించిన ఎమ్మెల్యే కొణతాలతో కేంద్రాన్ని ప్రారంభించారని పేర్కొన్నారు. దీనిపై కలెక్టర్, జడ్పీ సీఈవో, పంచాయతీరాజ్ కమిషనర్‌కు ఫిర్యాదు చేసామన్నారు.