ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేరుస్తున్నాం: మాధవి రెడ్డి

KDP: ప్రజలకిచ్చిన ప్రతి వాగ్దానాన్ని కూటమి ప్రభుత్వం నెరవేరుస్తుందని కడప MLA మాధవిరెడ్డి అన్నారు. శుక్రవారం కడపలోని పాలెం పాపయ్య వీధిలో 'సుపరిపాలనలో తొలి అడుగు' కార్యక్రమంలో భాగంగా ప్రభుత్వ పథకాల గురించి ప్రజలకు వివరించారు. ఈ సందర్భంగా మాధవి రెడ్డి మాట్లాడుతూ..ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన ప్రతి వాగ్దానాన్ని నెరవేర్చేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు.