VIDEO: శంభునిపేట హత్య కేసును ఛేదించిన పోలీసులు
WGL: అజాం జాహి మిల్స్ కాలనీ పరిధిలోని శంభునిపేటలో జరిగిన హత్య స్థానికంగా కలకలం రేపింది. ఈ కేసుపై ముమ్మర దర్యాప్తు చేసిన పోలీసులు 48 గంటల్లో ఛేదించారు. కాలనీకి చెందిన తాన్వీర్ అలం అప్పుల ఒత్తిడితో దోపిడీకి పాల్పడి, దూరిషాను కత్తితో గొంతు కోసి హత్య చేసి, రూ.4,500 దోచుకున్నాడు. అయితే సీసీటీవీ, సాంకేతిక ఆధారాలతో నిందితుడిని అరెస్ట్ చేసినట్లు అజాం జాహి మిల్స్ CI రమేష్ తెలిపారు.