INSPIRATION: ఏపీజే అబ్దుల్ కలాం
భారత క్షిపణి పితామహుడు, మాజీ రాష్ట్రపతి డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం ప్రతి ఒక్కరికీ గొప్ప స్ఫూర్తి. 'కలలు కనండి.. వాటిని సహకారం చేసుకోండి' అన్న ఆయన మాటలు కోట్లాది మందిలో ధైర్యాన్ని నింపాయి. పేదరికంలో పుట్టినా, క్రమశిక్షణ, పట్టుదలతో దేశ అత్యున్నత పదవిని అధిరోహించారు. ఆయన వినయం, నిరంతర అభ్యాసం మనందరికీ ఆదర్శం. అసాధ్యాన్ని సుసాధ్యం చేయడమే ఆయన అసలైన విజయం.