అజ్ఞాతంలోకి మాజీ ఎంపీ

అజ్ఞాతంలోకి మాజీ ఎంపీ

KKD: కాకినాడలో ఉన్న ఒక ట్రస్ట్‌ పునరుద్ధరణకు రూ.25 లక్షలు తీసుకుని మోసం చేశారని బాధితులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు తుళ్లూరు పోలీసులు వైసీపీ మాజీ ఎంపీ సురేష్‌పై శుక్రవారం కేసు నమోదుచేశారు. ఫిర్యాదుదారులను స్టేషన్‌కు పిలిచి వివరాలు సేకరించారు. ఈ కేసులో సురేష్‌ను అరెస్ట్‌ చేసే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో ఆయన అజ్ఞాతంలోకి వెళ్లడంతో పోలీసులు గాలింపు చేపట్టారు.