VIDEO: ప్రజలు అప్రమత్తంగా ఉండాలని గ్రామాలలో ప్రచారం

VIDEO: ప్రజలు అప్రమత్తంగా ఉండాలని గ్రామాలలో ప్రచారం

MNCL: జన్నారం మండలంలోని అన్ని గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని లక్షెట్టిపేట సీఐ రమణమూర్తి సూచించారు. మంగళవారం వివిధ గ్రామాలలో సర్పంచుల ఆధ్వర్యంలో డప్పు చాటింపు వేయించారు. మండలంలోని వివిధ గ్రామాలలో దొంగతనాలు పెరుగుతున్నాయని ఆయన వెల్లడించారు. తాళం వేసిన ఇళ్లను లక్ష్యంగా చేసుకుని గుర్తు తెలియని వ్యక్తులు దొంగతనాలకు పాల్పడే ప్రమాదం ఉందన్నారు.