బైక్‌లో నుంచి డబ్బులు కాజేసిన దుండగుడు
KMR: బాన్సువాడలో సినీ ఫక్కిలో చోరీ జరిగింది. నరేందర్ రెడ్డి యూనియన్ బ్యాంకు నుంచి రూ.1.30 లక్షలు డ్రా చేశారు. ఫ్రెండ్‌కు కొన్ని డబ్బులు ఇవ్వగా మిగత రూ.75,000 బైక్ ట్యాంక్ కవర్‌లో పెట్టాడు. ఆయనను ఫాలో చేసిన దుండగులు బైక్‌కు కొద్ది దూరంలో మీ డబ్బులు పడ్డాయని చెప్పారు. ఆ డబ్బులు తీసుకోవడానికి వెళ్లగా అంతలోనే దుండగులు బైకులో ఉన్న డబ్బులతో ఉడాయించారు.