ఈనెల 29న దివ్యాంగుల జిల్లా స్థాయి పోటీలు
MNCL: అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవం-2025ను పురస్కరించుకొని దివ్యాంగుల జిల్లా స్థాయి ఆటల పోటీలను ఈనెల 29న మంచిర్యాల ZPHS మైదానంలో నిర్వహించడం జరుగుతుందని జిల్లా సంక్షేమ అధికారి రౌఫ్ ఖాన్ బుధవారం ఓ ప్రకటనలో తెలిపారు. జిల్లాలోని జూనియర్, సీనియర్ దివ్యాంగులందరికీ పోటీలు నిర్వహిస్తామన్నారు. ఈ మేరకు గెలిచిన విజేతలను రాష్ట్ర స్థాయి పోటీలకు పంపిస్తామని పేర్కొన్నారు.