తెలుగు సాహిత్యం పట్ల అభిలాషను పెంచాలి. కలెక్టర్
PPM: నేటి యాంత్రిక జీవనంలో విద్యార్థులకు కేవలం పాఠ్య పుస్తకాలకే పరిమితం చేయకుండా, వారిలో తెలుగు సాహిత్యం పట్ల అభిలాషను, సృజనాత్మకతను పెంచాల్సిన బాధ్యత ఉపాధ్యాయులపై ఉందని కలెక్టర్ డా,ప్రభాకరరెడ్డి అన్నారు. తరగతి గదిలో విద్యార్థులకు గంటసేపు వినసొంపుగా పాఠాలు చెప్పడం అలవర్చుకోవాలని సూచించారు. తెలుగు పరిమళాలు మన చుట్టూ వెదజల్లాలని కలెక్టర్ పిలుపునిచ్చారు.