సెప్టిక్ ట్యాంక్‌లో పడి బాలుడు మృతి

సెప్టిక్ ట్యాంక్‌లో పడి బాలుడు మృతి

SKLM: టెక్కలి మండా పోలం కాలనీకి చెందిన కె .భవ్యాన్ (5) బుధవారం సాయంత్రం సెప్టిక్ ట్యాంకు‌లో పడిపోయి మృతి చెందాడు. స్థానికుల సమాచారం మేరకు.. ఇంటి సమీపంలో ఆటలాడుతూ ఉండగా నిర్మాణ దశలో ఉన్న మరో ఇంటి సెప్టిక్ ట్యాంకులో ప్రమాదవశాత్తు పడిపోయినట్లు తెలిపారు. కుటుంబ సభ్యులు టెక్కలి ఆసుపత్రికి తరలించగా అప్పటికే బాలుడు మృతిచెందినట్లు వైద్యులు పేర్కొన్నారు.