VIDEO: బకాయిలు చెల్లించాలని ఉపాధి కూలీలు ధర్నా
AKP: ఉపాధి హామీ కూలీలకు, సిబ్బందికి పెండింగ్‌లో ఉన్న బకాయిలు చెల్లించాలని రైతు కూలీ సంఘం జిల్లా కార్యదర్శి కోన మోహన్ రావు డిమాండ్ చేశారు. బుధవారం బుచ్చయ్యపేట ఎంపీడీవో ఆఫీస్ వద్ద సంఘం ఆధ్వర్యంలో ఆందోళన కార్యక్రమం నిర్వహించి ఎంపీడీవోకి వినతి పత్రం అందజేయడం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఉపాధి కూలీలకు సంవత్సరానికి 200 రోజులు పనులు కల్పించలన్నారు.