VIDEO: చెగ్యాం- మారేడుపల్లి రూట్లో అధ్వానం
JGL: వెల్గటూర్ మండలం చెగ్యాం నుంచి మారేడుపల్లి వరకు ఉన్న రహదారి గుంతలతో ప్రమాదకరంగా మారింది. దీంతో ప్రయాణికులు, స్థానికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కొత్త రోడ్డు వేస్తామని ఇచ్చిన హామీలు అమలు కాకపోవడంతో ప్రజల్లో ఆగ్రహం వ్యక్తమవుతోంది. ఈ మార్గంలో రోజూ రెండు డిపోల బస్సులు తిరుగుతుండడంతో సమస్య తీవ్రతరమైందని వాహనదారులు వాపోతున్నారు.