10న క్లాట్ ప్రాథమిక 'కీ' విడుదల
దేశవ్యాప్తంగా కామన్ లా అడ్మిషన్ టెస్ట్ ఆదివారం ప్రశాంతంగా జరిగింది. ఈ పరీక్షకు మొత్తం 92,344 మంది దరఖాస్తు చేసుకున్నారు. అండర్ గ్రాడ్యుయేట్‌కు 75,009 మంది దరఖాస్తు చేయగా.. 97 శాతం మంది హాజరయ్యారు. పీజీకి 17,335 మంది అప్లై చేయగా 92.45 శాతం మంది పరీక్ష రాశారు. ఈనెల 10న ప్రాథమిక కీ విడుదల చేస్తామని, అభ్యంతరాలుంటే 12వ తేదీ వరకు పంపవచ్చని NLUS పేర్కొంది.