బల్లికురవలో 3 రోజులు విద్యుత్ సరఫరా నిలిపివేత

ప్రకాశం: మండల కేంద్రమైన బల్లికురవ సబ్‌స్టేషన్ పరిధిలో గురువారం నుంచి 3 రోజులు విద్యుత్ సరఫరా నిలిపివేస్తున్నట్లు ఈఈ మస్తాన్ రావు బుధవారం తెలిపారు. ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు అంతరాయం ఏర్పడుతుందన్నారు. సబ్ స్టేషన్ పరిధిలోని విద్యుత్ లైన్ల ఆధునీకీకరణ పనుల్లో భాగంగా సరఫరా నిలిపివేస్తామన్నారు. వినియోగదారులు సహకరించాలన్నారు.