ఘనంగా వాసవి కన్యకా పరమేశ్వరి జయంతి వేడుకలు

ఘనంగా వాసవి కన్యకా పరమేశ్వరి జయంతి వేడుకలు

VZM: రాజాం మండలం పుచ్చలవీధిలో వాసవి కన్యకా పరమేశ్వరి ఆలయంలో బుధవారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ ఆలయంలో వాసవి కన్యకా పరమేశ్వరి జయంతి వేడుకలు ఘనంగా చేశారు. ఈ జయంతి సందర్భంగా అమ్మవారికి 108 రకాల స్వీట్లతో నైవేద్యం పెట్టినట్లు ఆలయ ప్రధాన అర్చకులు తెలిపారు. ఉదయం నుంచి ఆలయానికి భక్తులు వచ్చి ప్రత్యేక పూజలు చేసుకుని తీర్థ ప్రసాదాలు పుచ్చుకున్నారు.