వరంగల్‌లో వివాహిత అదృశ్యం

వరంగల్‌లో వివాహిత అదృశ్యం

WGL: వర్ధన్నపేట పట్టణానికి చెందిన వివాహిత చిన్నబోయిన భారతి (32) అదృశ్యమైనట్లు ఎస్సై చందర్ తెలిపారు. ఈనెల 24న తల్లిగారి ఇంటికి వెళ్తానని చెప్పి ఇంట్లో నుంచి బయలుదేరిన ఆమె ఇప్పటివరకు తిరిగి రాలేదన్నారు. భారతి జాడ కోసం భర్త రమేష్ బంధువుల వద్ద వెతికినా ఎటువంటి సమాచారం లభించలేదు. ఈ ఘటనపై భర్త ఇచ్చిన ఫిర్యాదు మేరకు గురువారం మిస్సింగ్ కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.