జిల్లా మహిళా క్రికెటర్లకు శుభవార్త

ATP: ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ (ACA) అనంతపురంలో మహిళల కోసం క్రికెట్ అకాడమీ ఏర్పాటు చేయనుంది. ఈ మేరకు ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నట్లు తెలిపింది. సుమారు 50 మంది ప్లేయర్లకు శిక్షణ ఇచ్చేలా అకాడమీని ఏర్పాటు చేయనున్నారు. ప్లేయర్ల కోసం 20 మంది వరకు కోచ్‌లను, ఫిజియోలు, ఇతర సిబ్బందిని నియమించనున్నారు.