కలెక్టరేట్లో ఆకట్టుకున్న ఫోటోగ్రఫీ ప్రదర్శన

SRD: వరల్డ్ ఫోటోగ్రఫీ డే సందర్భంగా సంగారెడ్డి కలెక్టర్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన ఫోటోగ్రఫీ ప్రదర్శన ప్రత్యేకంగా ఆకట్టుకుంది. వివిధ దినపత్రికల ఫోటోగ్రాఫర్లు తీసిన ఫోటోలను ప్రదర్శించారు. టీజిఐఐసి చైర్ పర్సన్ నిర్మల రెడ్డి, కలెక్టర్ ప్రావిణ్య, ఎస్పీ పరితోష్ పంకజ్ ఫోటోలను చూసి ప్రత్యేకంగా అభినందించారు.