అక్రమ ఇసుక రవాణాపై ఉక్కుపాదం

అక్రమ ఇసుక రవాణాపై ఉక్కుపాదం

KNR: జిల్లాలో అక్రమ ఇసుక రవాణాపై కఠిన చర్యలు తీసుకుంటున్నట్లు సీపీ గౌష్ ఆలం తెలిపారు. మార్చిలో 120 కేసులు నమోదు చేసి, 139 వాహనాలను స్వాధీనం చేసుకున్నామన్నారు. ఈ ఏడాది మొత్తం 245 కేసులు, 357 వాహనాలు పట్టుబడ్డాయని వివరించారు. నిబంధనలు అతిక్రమిస్తే ఎంతటి వారైనా ఉపేక్షించేది లేదని, పీడీ యాక్ట్ నమోదు చేస్తామని ఆయన హెచ్చరించారు.