జనసేన సభ్యత్వం నమోదు కార్యక్రమంలో రసాభాస
AP: కృష్ణా జిల్లా కంకిపాడులో ఉద్రిక్తత చోటుచేసుకుంది. జనసేనలో భగ్గుమన్న విభేదాలతో పార్టీ నాయకులు రెండు వర్గాలుగా విడిపోయి పరస్పరం దాడులు చేసుకున్నారు. కంకిపాడులో జనసేన సభ్యత్వ నమోదు కార్యక్రమం ఆ పార్టీ నేతలు నిర్వహించారు. అయితే, ఈ సందర్భంగా ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. దీంతో సునీల్, స్వాతి వర్గీయుల మధ్య వివాదం తలెత్తింది. ఇరువర్గాలు దాడులు చేసుకోగా.. పోలీసులు చెదరగొట్టారు.