చెరువులో ఈతకు వెళ్లి విద్యార్థి గల్లంతు
GDWL: షాద్‌నగర్ పరిధిలోని మహాత్మా జ్యోతిబాఫూలే బీసీ వసతి గృహ విద్యార్థి రాజు చెరువులో ఈతకు వెళ్లి గల్లంతయ్యాడు. హోలీ సందర్భంగా స్నానానికి వెళ్లిన అతను తిరిగి రాలేదు. మృతుడు గద్వాల జిల్లా అయిజ మండలం కొత్తపల్లికి చెందినవాడిగా గుర్తించారు. ఎన్డీఆర్‌ఎఫ్ బృందాలు గాలిస్తున్నా ఆచూకీ లభించలేదు. కుమారుడు క్షేమంగా రావాలని తల్లిదండ్రులు కోరుతున్నారు.