ఇంటిపై నుంచి పడి హెడ్ కానిస్టేబుల్ మృతి

NZB: జిల్లా కేంద్రంలోని వర్ని రోడ్ సాయినగర్లో నివాసముంటున్న హెడ్ కానిస్టేబుల్ శ్రీనివాస్ బుధవారం నూతనంగా నిర్మిస్తున్న భవనం 3వ అంతస్తు నుంచి కిందపడి మృతి చెందారు. ఆయన ఇందల్వాయి పోలీస్ స్టేషన్లో హెడ్ కానిస్టేబుల్‌గా విధులు నిర్వహిస్తున్నారు. బుధవారం ఉదయం ఇంటికి వాటర్ కొడుతుండగా ప్రమాదవశాత్తు కిందపడి మృతి చెందారు.