'సమానత్వానికి ప్రతీక సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్'

JGL: జిల్లా సమీకృత కార్యాలయంలో రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ జయంతి వేడుకలు జిల్లా వెనుకబడిన తరగతి అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో నిర్వహించారు. దీనిలో భాగంగా జిల్లా అదనపు కలెక్టర్ బి. ఎస్ లత, జ్యోతి ప్రజ్వలన చేసి నివాళులర్పించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ.. విరోచిత పోరాటానికి, సమానత్వానికి ప్రతీక సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ అన్నారు.