వెల్దుర్తి మండలంలో దారుణ హత్య
MDK: వెల్దుర్తి మండలం బండమీదిపల్లి గ్రామంలో దారుణం చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన బాలేష్ అనే వ్యక్తిని వ్యవసాయ పొలం వద్ద గుర్తుతెలియని దుండగులు బుధవారం అర్ధరాత్రి దారుణంగా కొట్టి హత్య చేశారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని తూప్రాన్ ఏరియా ఆసుపత్రికి తరలించారు.