పాడి గేదెల పథకం దరఖాస్తుల స్వీకరణ గడువు పెంపు
నిర్మల్: జిల్లాలో SC కార్పొరేషన్ ద్వారా 2025-26 ఆర్థిక సంవత్సరానికి గాను '2 పాడి గేదెల పథకం' కింద అర్హులైన వారు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని కలెక్టర్ అభిలాష సూచించారు. దరఖాస్తు గడువును ఈనెల 23 వరకు పొడిగించామన్నారు. ఈ సదావకాశాన్ని జిల్లాలోని SC నిరుద్యోగులు, రైతులు వినియోగించుకోవాలని కోరారు. ఇతర వివరాల కోసం సంబంధిత కార్యాలయంలో సంప్రదించాలన్నారు.