ఇంధన పొదుపు వారోత్సవాల పోస్టర్ ఆవిష్కరణ
GNTR: విద్యుత్ వంటి ఇంధన వనరులను పొదుపుగా వినియోగించి భావితరాలకు అందించాలని జిల్లా కలెక్టర్ ఏ.తమీమ్ అన్సారియా పిలుపునిచ్చారు. జాతీయ ఇంధన వనరుల పొదుపు వారోత్సవాల్లో భాగంగా డిసెంబర్ 14 నుంచి 20వ వరకు జరుగుతున్న విద్యుత్ పొదుపు వారోత్సవాల ప్రచార పోస్టర్‌ను సోమవారం కలెక్టరేట్‌లో తమీమ్ అన్సారియా ఆవిష్కరించారు.