'నేడు జిల్లాలో PGRS కార్యక్రమం'

'నేడు జిల్లాలో PGRS కార్యక్రమం'

నంద్యాల: జిల్లా కలెక్టరేట్‌తో పాటు మండల, డివిజన్, మున్సిపల్ కార్యాలయాల్లో సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక నిర్వహిస్తామని కలెక్టర్ జి. రాజకుమారి ఒక ప్రకటనలో తెలిపారు. ప్రజలు తమ అర్జీలను నేరుగా లేదా ఆన్‌లైన్‌లో సమర్పించవచ్చని తెలిపారు. అర్జీ స్థితిని వెబ్‌సైట్ లేదా 1,100 టోల్ ఫ్రీ నంబర్ ద్వారా తెలుసుకోవచ్చని పేర్కొన్నారు.