మరుపల్లి హై‌స్కూల్‌కు వాటర్ ఫిల్టర్ అందజేత

మరుపల్లి హై‌స్కూల్‌కు వాటర్ ఫిల్టర్ అందజేత

VZM: గజపతినగరం మండలంలోని మరుపల్లి హైస్కూల్‌కు ఆరిశెట్టి సందీప్ వాటర్ ఫిల్టర్‌ను సోమవారం అందజేశారు. ఈ పాఠశాలలో ఉపాధ్యాయుడిగా పనిచేసిన ఆరిశెట్టి రామకృష్ణ జ్ఞాపకార్థం రూ. 18 వేల విలువచేసే వాటర్ ఫిల్టర్‌ను కుమారుడు సందీప్ అందించారు. ఈ కార్యక్రమంలో పొట్టి శ్రీరాములు స్మారక సేవాసమితి అధ్యక్షులు చెరుకూరి నాగరాజు, సముద్రాల నాగరాజు, తదితరులు పాల్గొన్నారు.