ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కారించాలని వినతి
MNCL: ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కారానికి కృషి చేయాలని తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం జిల్లా నాయకులు కోరారు. మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావుకు వినతిపత్రం అందజేశారు. PRC రిపోర్టు వెంటనే తెప్పించి ఉద్యోగ, ఉపాధ్యాయులకు వేతన సవరణ చేయాలన్నారు. పెండింగ్ DAలు ప్రకటించాలని, 2003 DSC వాళ్లకు పాత పెన్షన్ వర్తింపు చేయాలని కోరారు.