ఉద్యోగాలకు నేడే లాస్ట్
హైదరాబాదులోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ రూరల్ డెవలప్‌మెంట్ & పంచాయతీరాజ్‌లో 4 పోస్టులకు దరఖాస్తు చేసుకునేందుకు గడువు నేటితో ముగియనుంది. ఈ మేరకు అభ్యర్థులు బీటెక్, ఎంటెక్, ఎంసీఏ అర్హతతో పాటు పని అనుభవం ఉన్నవారు దరఖాస్తు చేసుకోవచ్చని అధికారులు వెల్లడించారు. వయసు 21 నుంచి 50 ఏళ్ల మధ్య ఉన్నవారు carrer.nirdpr.in వెబ్‌సైట్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు.