మహిళా డిగ్రీ కళాశాలలో పుస్తక ప్రదర్శన
NLG: దేవరకొండలోని తెలంగాణ ప్రభుత్వ గిరిజన గురుకుల మహిళా డిగ్రీ కళాశాలలో గ్రంథాలయాల వారోత్సవాలలో భాగంగా గురువారం పుస్తక ప్రదర్శన నిర్వహించారు. ఈ వారోత్సవాలు ఈనెల 14 నుంచి 20 వరకు విజయవంతంగా జరుపుకొని చివరి రోజున పుస్తక ప్రదర్శన నిర్వహించినట్లు ప్రిన్సిపల్ డాక్టర్ ఎం.హరిప్రియ తెలిపారు. విద్యార్థినీలు, అధ్యాపకులు గ్రంథాలయ నిర్వాహకులు పాల్గొన్నారు.