VIDEO: జోహార్ వాజ్ పేయి అంటూ నినాదాలు చేసిన బీజేపీ నాయకులు
EG: రాజమండ్రి నగరంలో తూర్పుగోదావరి జిల్లా భారతీయ జనతా పార్టీ జిల్లా అధ్యక్షులు పిక్కి నాగేంద్ర ఆదివారం ఉదయం పర్యటించారు. గోరక్షణ పేటలో సర్కిల్ వద్ద అటల్ బిహారీ వాజ్ పేయ్ కాంస్య విగ్రహాన్ని బీజేపీ ముఖ్య నాయకులతో కలిసి నాగేంద్ర స్థాపించారు. జోహార్ భారత్ మాతాకీ జై, జోహార్ వాజ్ పేయి జై అంటూ నినాదాలు చేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శి బొమ్మల దత్తు పాల్గొన్నారు.