యూరియా సరఫరాలో ప్రభుత్వం విఫలమైంది

యూరియా సరఫరాలో ప్రభుత్వం విఫలమైంది

WGL: సంగెం (M) కుంటపల్లిలో మంగళవారం MCPI(U) నాయకుడు కామ్రేడ్ గోనే రామచందర్ ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించారు. కామ్రేడ్ ఇస్మాయిల్ మాట్లాడుతూ, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వైఫల్యాల వల్ల రైతులు యూరియా కష్టాలు ఎదుర్కొంటున్నారని ఆరోపించారు. కార్పొరేట్ సంస్థలపై ప్రేమ చూపే ప్రభుత్వాలు రైతులపై శ్రద్ధ చూపడం లేదని, యూరియాను వెంటనే సరఫరా చేయాలని డిమాండ్ చేశారు.