ఈనెల 20న అత్తిలి మండల పరిషత్ సమావేశం

W.G: అత్తిలి మండల ప్రజా పరిషత్ సర్వసభ్య సమావేశం ఈనెల 20న నిర్వహిస్తున్నట్లు ఇంఛార్జ్ ఎంపీడీవో ఎం.శ్రీనివాసరావు సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఎంపీపీ మక్కా సూర్యరావు అధ్యక్షతన స్థానిక మండల ప్రజా పరిషత్ సమావేశ మందిరంలో మధ్యాహ్నం 2గంటలకు జరిగే ఈ సమావేశంలో వివిధ శాఖల అధికారులు, సర్పంచులు ఎంపీటీసీ సభ్యులు, ప్రజాప్రతినిధులు పాల్గొనాలని కోరారు.