ప్రజలకు ప్రధాని మోదీ శుభాకాంక్షలు

గురుగ్రంథ్ సాహిబ్ పవిత్ర ప్రకాష్ పురబ్ సందర్భంగా ప్రధాని మోదీ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. గురుగ్రంథ్ సాహిబ్ కాలాతీత బోధనలు ప్రపంచవ్యాప్తంగా జీవితాలను ప్రకాశింపజేస్తున్నాయని.. కరుణ, వినయం, సేవా విలువలను అవి గుర్తు చేస్తున్నాయని మోదీ X వేదికగా పోస్ట్ చేశారు. ఆయన బోధనలు మానవాళిని ఐక్యత, సామరస్యం వైపు నడిపిస్తాయని పేర్కొన్నారు.