ట్రాన్స్ ఫార్మర్ వైర్లు ఎత్తుకెళ్లిన దొంగలు

ట్రాన్స్ ఫార్మర్ వైర్లు ఎత్తుకెళ్లిన దొంగలు

PDPL: పెద్దపల్లి మండలం కనగర్తి గ్రామంలో రైతులకు సాగు నీరు సరఫరా అయ్యే ట్రాన్స్ ఫార్మర్ను అక్కడి నుంచి తొలగించి పంట పొలాల్లో వేసి అందులోని వైరును దొంగలు ఎత్తుకెళ్లారు. విషయం తెలుసుకున్న విద్యుత్ శాఖ అధికారులు ఘటనా స్థలానికి చేరుకొని రైతుల నుంచి వివరాలు అడిగి తెలుసుకున్నారు. సంఘటనపై పోలీసులకు రైతులు ఫిర్యాదు చేయనున్నారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.