'స్మార్ట్ కిచెన్ ప్రతిపాదన విరమించుకోవాలి'
PPM: పాఠశాలలలో మధ్యాహ్న భోజన పథకాన్ని స్మార్ట్ కిచెన్ పేరుతో ప్రైవేటీకరించే ఆలోచనను ప్రభుత్వం విరమించుకోవాలని సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి యమ్మల మన్మధరావు, గిరిజన సంఘం నాయకుడు మండింగి శ్రీనివాసరావు సోమవారం కురుపాంలో డిమాండ్ చేశారు. ఎంఈఓ కార్యాలయం వద్ద మధ్యాహ్న భోజన నిర్వాహకులుతో కలిసి ధర్నా చేపట్టారు. అనంతరం ఎంఇఓకి వినతిపత్రం సమర్పించారు.