శ్రీ వాంఛకల్పలత గణపతికి విశేష పూజలు
TPT: ఏర్పేడు మండలం పాపా నాయుడుపేట శ్రీ లక్ష్మీ హయగ్రీవ దేవస్థానంలో వెలసిన శ్రీ వాంఛకల్పలత గణపతికి సంకటహర చతుర్థి సందర్భంగా సోమవారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయంలో విశేష ద్రవ్యాలతో రుద్రాభిషేకం, అలంకరణ, ఆర్చనలు ఘనంగా జరిగాయి. భక్తులు పెద్ద ఎత్తున పాల్గొని స్వామి దర్శించుకున్నారు.