'క్రీడల అభివృద్ధికి అధికారులు వెంటనే చర్యలు చేపట్టాలి'

'క్రీడల అభివృద్ధికి అధికారులు వెంటనే చర్యలు చేపట్టాలి'

HNK: హనుమకొండ జిల్లాలో క్రీడల అభివృద్ధికి ప్రత్యేక చర్యలు తీసుకోవాలని వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి ఆదేశించారు. హనుమకొండ జిల్లా కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఇవాళ ఆయన కలెక్టర్ ప్రావీణ్యతో కలిసి క్రీడల అభివృద్ధిపై సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మేయర్ గుండు సుధారాణి, కూడా చైర్మన్ వెంకటరామిరెడ్డి పాల్గొన్నారు.