శిథిలావస్థలో ఉన్న ఇళ్లను పరిశీలించిన కార్యదర్శి

శిథిలావస్థలో ఉన్న ఇళ్లను పరిశీలించిన కార్యదర్శి

NZB: మోస్రా మండలంలో శనివారం ఉదయం నుంచి కురుస్తున్న వర్షాల నేపథ్యంలో కూలిపోయే స్థితిలో ఉన్న నివాస గృహాలను పంచాయతీ కార్యదర్శి శ్రావణ్ కుమార్ పరిశీలించారు. ప్రజల కోసం పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేశామని, ఇబ్బందులు ఉన్నవారు అక్కడికి వెళ్లాలని ఆయన సూచించారు. గ్రామంలోని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కోరారు.