రైతుకు ఆధార్ కార్డు తరహాలో 'భూధార్' కార్డు: కలెక్టర్

NZB: భూమి కలిగిన ప్రతి రైతుకు ఆధార్ కార్డు తరహాలో 'భూధార్' కార్డు ఇవ్వనున్నట్లు నిజామాబాద్ జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు తెలిపారు. గురువారం ఏర్గట్ల మండలం బట్టాపూర్‌లో భూభారతి నూతన చట్టంపై రైతులకు అవగాహన కల్పించారు. ఇది వరకు ధరణిలో రికార్డుల నిర్వహణ లేదని, ఇప్పుడు రికార్డుల నిర్వహణ ఉంటుందని చెప్పారు.