విద్యార్థినులను సత్కరించిన తహసీల్దార్ వెంకటస్వామి
WGL: పర్వతగిరి మండల కేంద్రంలోని కస్తూర్బా గాంధీ బాలిక విద్యాలయంలో ఎం.ఎల్.టి గ్రూప్‌లో అత్యధిక మార్కులు సాధించిన విద్యార్థినులు వైష్ణవి, కల్పన 481/500 మార్కులు, లాస్య 462/500 మార్కులు సాధించారు. ఈ సందర్భంగా తహసీల్దార్ టి. వెంకటస్వామి ఇవాళ విద్యార్థినులను శాలువాలతో సత్కరించి అభినందించారు. 88 శాతం ఉత్తీర్ణత సాధించడంపై సిబ్బందిని కూడా ఆయన అభినందించారు.