హోటళ్ళు, లాడ్జీల్లో తనిఖీలు

VSP: విశాఖ సీపీ శంఖబ్రత బగ్చ్ ఆదేశాల మేరకు మంగళవారం పలు హోటళ్ళు, లాడ్జీల్లో పోలీసులు ఆకస్మిక తనిఖీలు చేశారు. హోటళ్ళు, లాడ్జీల్లో అసాంఘిక కార్యకలాపాలు జరగకుండా భద్రతా ప్రమాణాలు, రికార్డుల తనిఖీ, సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని పోలీసులు యాజమాన్లకు తెలియజేశారు. ప్రజా భద్రత కొరకే ఈ తనిఖీలు చేయడం జరుగుతుందని పోలీసులు తెలిపారు.