VIDEO: తుది మెరుగుల్లో ఖైరతాబాద్ మహా గణపతి

HYD: వినాయక చవితికి మరో ఐదు రోజులే మిగిలి ఉండడంతో మహాగణపతి తయారీ పనులు చివరి దశకు చేరుకున్నాయి. 71వ సంవత్సరం సందర్భంగా 69 అడుగుల ఎత్తులో శ్రీ విశ్వశాంతి మహాశక్తి గణపతి భక్తులకు దర్శనం ఇవ్వనున్నాడని దివ్యజ్ఞాన గురూజీ విఠల్ శర్మ తెలిపారు. ఈనెల 25న మహాగణపతికి నేత్రోన్మీలన కార్యక్రమం ఉంటుందని పేర్కొన్నారు.